నల్గొండ జిల్లాను గతంలోని బీఆర్ఎస్ సర్కార్ సర్వనాశనం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komati Reddy Venkat Reddy ) అన్నారు.జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్( KCR ), బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్న మంత్రి కోమటిరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవుకు కేసీఆరే కారణమని పేర్కొన్నారు.

దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు.అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project ) కట్టారన్నారు.ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని చెప్పారు.
సూర్యాపేటలో మంచినీళ్లు లేక మూసీ నీళ్లు తాగుతున్నారన్నారు.రాజకీయాలంటే తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.







