టాలీవుడ్ క్యూట్ కపుల్ అయినా సమంత అక్కినేని నాగచైతన్య( Samantha Naga Chaitanya ) ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు.
సామ్, చై విడిపోయినట్టు ఒక్కసారిగా ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు.కాగా సమంత నాగచైతన్య ఇద్దరు కలిసి ఏం మాయ చేసావే( Yem Maya Chesave ) సినిమాలో కలిసి నటించారు.
ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీరు ఆ తర్వాత ఆటోనగర్ సూర్య సినిమా చేసిన సమయంలో ప్రేమలో పడ్డారు.అలా ఇద్దరు కొంతకాలం పాటు ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
ఆ తరువాత ఇరువురి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.సినీ పరిశ్రమలోనే బెస్ట్ కపుల్( Best Couple )గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు.తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు.ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని చెప్పారు.అదే వారిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్న వారిద్దరి విడాకులకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా తెలియదు.
ఎవరికి వారు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య బంధం గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది.వీళ్లిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నప్పటికీ ఈ పెళ్లి ఫొటోను మాత్రం నాగార్జున( Nagarjuna ) ఇంట్లోని హాల్లో భద్రంగానే ఉంచారట.వాళ్లు విడిపోయారు కదా ఇంకెందుకు అని చాలా మంది అంటున్నా దాన్ని మాత్రం తీయడం లేదని తెలిసింది.
విడిపోయిన తర్వాత కూడా సమంత, నాగ చైతన్య పెళ్లి ఫొటోను తీసేయకపోవడానికి కారణం అందులో అక్కినేని ఫ్యామిలీ మెంబర్లు( Akkineni Family Members ) మొత్తం ఉండడమే అని తెలిసింది.అందులో నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట.
ఈ వార్తలో ఎంత నిజముందో కానీ, ఇది హాట్ టాపిక్ అవుతోంది.