Heroes Love Marriages : సౌత్ ఇండస్ట్రీలో కో స్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు వీళ్లే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ప్రేమలో పడటం సర్వసాధారణం.అయితే సెలబ్రిటీలు కొందరు ప్రేమలో పడి వారినే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా మరికొందరు మాత్రం విడాకులు తీసుకుని విడిపోయారు.

 Heroes Who Fell In Love With Co Stars Nagarjuna Amala Surya Jyothika Yash Radhi-TeluguStop.com

అయితే చాలామంది హీరో హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారినే పెళ్లి చేసుకుని ప్రస్తుతం జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.మరి సౌత్ ఇండస్ట్రీలో కోస్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే.

నాగార్జున- అమల:

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున( Nagarjuna ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తన కోస్టార్ అయినటువంటి అమల ( Amala ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే నాగార్జునకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం వీరిద్దరూ రెండు సినిమాలలో నటించారు ఈ సమయంలోనే ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Telugu Ajith, Amala, Marriages, Heroes, Heroesstars, Jyothika, Love, Mahesh Babu

మహేష్ బాబు-నమ్రత:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రత( Namrata ) ఇద్దరు కూడా ప్రేమ వివాహమే వీరిద్దరూ కలిసి వంశం సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు అనంతరం పెళ్లి చేసుకుని ఇప్పటికి తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Telugu Ajith, Amala, Marriages, Heroes, Heroesstars, Jyothika, Love, Mahesh Babu

ప్రసన్న- స్నేహ:

స్నేహ( Sneha ) తెలుగు హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈమె కోలీవుడ్ నటుడు ప్రసన్న( Prasanna ) తో కలిసి పలు తమిళ సినిమాలలో నటించారు.ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడటం అనంతరం ప్రజల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.

Telugu Ajith, Amala, Marriages, Heroes, Heroesstars, Jyothika, Love, Mahesh Babu

సూర్య-జ్యోతిక:

టాలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Surya )సినీ నటి జ్యోతిక( Jyothika ) ఇద్దరిది కూడా ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు.అయితే సూర్య జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.అనంతరం సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించి తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు.

Telugu Ajith, Amala, Marriages, Heroes, Heroesstars, Jyothika, Love, Mahesh Babu

అజిత్ -శాలిని:

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు అజిత్( Ajith ) ఒకరు.ఈయన వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఈయన నటి శాలిని( Shalini ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇలా వీరిద్దరూ సినిమాలలో నటిస్తూనే ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Telugu Ajith, Amala, Marriages, Heroes, Heroesstars, Jyothika, Love, Mahesh Babu

యశ్ – రాధిక పండిత్:

కన్నడ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యష్( Yash ) కే జి ఎఫ్ సినిమా ద్వారా రాఖీ బాయ్గా కూడా గుర్తింపు పొందారు ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన తన సహ నటి రాధిక పండిట్( Radhika Pandit ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు దూరంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube