సాధారణంగా మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్య( Respiratory problem )లలో పొడి దగ్గు కూడా ఒకటి.పొడి దగ్గు సమస్యతో మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు.
అయితే రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సమస్య మనల్ని ఎప్పుడూ కూడా వేధిస్తూ ఉంటుంది.అదేవిధంగా ఈ సమస్య కారణంగా మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా మరింత ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చాలామంది సమస్యల నుండి బయటపడడానికి మందులను, సిరప్లను వాడుతుంటారు.అయినప్పటికీ కూడా కొందరికి పొడి దగ్గు నుండి ఎలాంటి ఉపశమనం కలగదు.
ఇలా పొడి దగ్గు( Dry cough )తో బాధపడేవారు కొన్ని చిట్కాలను పాటించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

పొడి దగ్గుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని త్రాగాలి.నీటిని తాగినప్పుడల్లా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.గోరువెచ్చని నీటిని తాగడం వలన శరీరం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు గొంతు చికాకు, పొడి దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా అల్లం నీటిని తాగడం వలన కూడా పొడి దగ్గు సమస్య నుండి బయటపడవచ్చు.అల్లం ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం నీటి( Ginger water )ని తాగడం వలన పేరుకుపోయిన శ్లేష్మం తొలగిపోతుంది.ఇక దగ్గు నుండి చక్కటి ఉపశమనం కూడా లభిస్తుంది.

అంతేకాకుండా పొడి దగ్గుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవడం వలన కూడా దగ్గు తగ్గుతుంది.తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ మైక్రోబెల్ లక్షణాలు కూడా ఉంటాయి.కాబట్టి ఇవి దగ్గుకు కారణమయ్యే క్రిములను నశింపజేస్తాయి.అలాగే గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తీసుకోవడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.ఈ నీటిని తీసుకోవడం వలన దగ్గు, ఆస్తమా లాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా కఫాన్ని తొలగించి దగ్గును తగ్గించడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడుతుంది.
పొడి దగ్గుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.







