మనుషుల్లో మూర్ఖత్వానికి హద్దే లేకుండా పోతుంది.ప్రాణాలకు రిస్కు ఉందని తెలిసినా చాలామంది సెల్ఫీల( Selfie ) కోసం పిచ్చి చేష్టలు చేస్తున్నారు తాజాగా ఇద్దరు ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని కారు నుంచి అడవి ప్రాంతంలో దిగారు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఏనుగు( Elephant ) అడవిలో ఇద్దరు వ్యక్తులను వెంబడించడం మనం చూడవచ్చు.
ఇదొక భయానక క్షణం అని చెప్పవచ్చు.ఆ ఇద్దరు మగవారు ఏనుగు చిత్రాలను తీయడానికి ప్రయత్నించారట, కానీ ఏనుగు వారి చేష్టల వల్ల బాగా కోపానికి గురైంది.
అది వారి వెంట పరుగెత్తడం ప్రారంభించింది, వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.వారిలో ఒకరు కాలుజారి పడిపోయారు, కానీ ఏనుగు అతన్ని కాళ్లతో తొక్కి చంపేయలేదు.
అది అతని వైపు చూసి హాని చేయకుండా వెళ్ళిపోయింది.కేరళలోని( Kerala ) ముతంగ నుంచి ఊటీకి వెళ్తున్న ఓ కుటుంబం ఈ వీడియో తీసింది.
వారు రోడ్డుపై ఏనుగును చూసి తమ కారును ఆపారు.

ఇద్దరు వ్యక్తులు ఆ కారు( Car ) దిగి తమ కెమెరాలతో ఏనుగు దగ్గరకు వచ్చారు.అది ఎంత ప్రమాదమో వారికి తెలియదు.కుటుంబం మొత్తం ఘటనను రికార్డ్ చేసి @wayanadgram అనే యూజర్‌నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
వారు ఫిబ్రవరి 1న వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో చాలా స్పందనలు వచ్చాయి.
ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా లైక్ చేయగా, వేల మంది దీనిపై కామెంట్ చేశారు.వీడియో చూసి చాలా మంది భయాందోళనకు గురయ్యారు.

కొంతమంది వారు మూర్ఖంగా ఉన్నారని, ఏనుగు పట్ల అగౌరవంగా ప్రవర్తించారని విమర్శించారు.ఏనుగు వారిని హెచ్చరించడం మాత్రమే చేసింది.అది కావాలనుకుంటే, వారిని చంపి ఉండవచ్చు.జంతువులను, వాటి ఆవాసాలను మనం గౌరవించాలి.వారు కారును అసలు ఎందుకు విడిచిపెట్టారు? అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.వార్నింగ్ సైన్స్ పెట్టిన అడవి ప్రాంతంలో ఎవరూ కూడా వాహనాల నుంచి దిగవద్దని మరి కొంతమంది కోరారు.







