నిజమైన ప్రేమంటే ఏంటో నేటి యువతకు చెప్పిన వృద్ధుడు.. వీడియో వైరల్...

మనం జీవితంలో ఎక్కువ కాలం పాటు భాగస్వామితోనే గడుపుతాం.తల్లిదండ్రులతో మహా అంటే 30 ఏళ్లు జీవిస్తే మిగతా జీవితమంతా భార్యా పిల్లలతోనే గడిపేస్తాం.

 The Old Man Told Today's Youth What True Love Is Video Viral, Elderly Man, Wife-TeluguStop.com

ఒకప్పుడు భారతదేశంలో వైవాహిక బంధాలకు ఎంతో వ్యాల్యూ ఉండేది కానీ ఇప్పుడు ఈ బంధానికి ముందే కొందరు యువతీ యువకులు డేటింగ్, లవ్ అంటూ పెళ్లికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు.పెళ్లయిన తర్వాత కూడా పెడదారులు పట్టి కలకాలం ఉండలేక మధ్యలోనే వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నారు.

ఈ రోజుల్లో స్వార్థంతో కోరికలను తీర్చుకునే వారే కనిపిస్తున్నారు.నిజమైన ప్రేమ చూపిస్తూ ఒకరికొకరు చివరిదాకా కలిసి ఉండే దంపతులు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

అయితే ట్రూ లవ్( True love ) అది ఎలా ఉంటుందో నేటి యువతకు చెప్పకనే చెప్పాడో వృద్ధుడు.ఆ పెద్దాయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఒక పెద్దాయన ఒక ఇంట్లో మంచం రిపేర్ చేస్తూ ఉంటాడు.ఆ సమయంలోనే అతనికి ఏదో అవసరం పడి తన దగ్గర ఉన్న పర్సును బయటకు తీస్తాడు.అప్పుడే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి గదిలో నుంచి బయటికి వచ్చి ఆ పెద్దాయన పర్సు వైపు చూస్తాడు.అప్పుడు అతనికి ఆ పర్సులో ఒక వృద్ధురాలి ఫోటో కనిపిస్తుంది.

వెంటనే ఆ వ్యక్తి పెద్దాయన దగ్గరకు వెళ్లి ఆ పర్సు( Purse )లో ఉన్న ఫోటో ఎవరిది అని ప్రశ్నిస్తాడు.అప్పుడు పెద్దాయన ఆ ఫోటో నా భార్యది అని సమాధానం చెప్పగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు.తన భార్య చనిపోయి రెండేళ్లు అవుతుందని, అప్పటినుంచి ఆమెకు గుర్తుగా తన ఫోటోని పర్స్ లో పెట్టుకున్నానని పెద్దాయన చెప్తాడు.ఆ పెద్దాయనకు భార్య మీద ఉన్న ప్రేమ చూసి ఆ వ్యక్తికి ఆశ్చర్యం వేస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.భార్యాభర్తల బంధం అంటే అలానే ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది ఏమో నిజమైన ప్రేమ అంటే ఏంటో పెద్దాయన అర్థమయ్యేలా చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube