బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్( Jackie Shroff ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
కాగా జాకీ ష్రాఫ్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే నేడు ఆయన 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అలాగే ఆయనకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా నేడు స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న జాకీ ష్రాఫ్ ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను పడ్డారట.మరి ఆ వివరాల్లోకి వెళితే.
గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమను ఏలుతున్నారు.

ఆయన నటించిన తొలి చిత్రం హీరో.( Hero Movie ) 1983లో విడుదలైన ఆ సినిమాకు సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించారు.అందులో జాకీ సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించారు.
హీరో సినిమాకి ముందు జాకీకి అసలు యాక్టింగే తెలియదు.డైలాగులు కూడా సరిగా చెప్పలేకపోయాడని సుభాష్ ఘాయ్ స్వయంగా చెప్పారు.
కానీ జాకీ ష్రాఫ్ ఎంతో కాన్ఫిడెన్స్‌తో సినిమాకు సైన్ చేశారు.జాకీ లుక్స్‌తో పాటు మీసాలను చూసే సినిమాను చేసినట్లు చెప్పారు.
కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది.హీరో సినిమా జాకీ భవితవ్యాన్నే మార్చేసింది.
తొలి సినిమాతోనే ఆయన బాలీవుడ్‌ను( Bollywood ) డామినేట్ చేశారు.ఈ సినిమా తర్వాత 200కు పైగా చిత్రాల్లో నటించారు.

కానీ సినిమాల్లోకి రాకముందు జాకీ ష్రాఫ్ ఎన్నో కష్టాలు పడ్డాడని మీకు తెలుసా? యాక్టింగ్( Acting ) చేయాలని అస్సలు అనుకోలేదట.విధి ఆయన్ని నటుడిని చేసింది.ప్రస్తుతం నట ప్రపంచాన్ని కుదిపేస్తున్న.జాకీ ష్రాఫ్ ఒకప్పుడు జర్నలిస్ట్( Journalist ) కావాలనుకున్నారట.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.
యుక్తవయసులో ఉన్నప్పుడు తాను చాలా కాలంగా నిరుద్యోగిగా ఉన్నానని తెలిపారు.సోదరుడి మరణించడంతో 11వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చిందని, పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డబ్బు సంపాదించేందుకు సినిమాల పోస్టర్లు అతికించడంతో పాటు బస్టాండ్‌లో వేరుశనగలు కూడా అమ్మను అని చెప్పుకొచ్చారు జాకీ ష్రాఫ్.

ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత ట్రావెల్ ఏజెంట్‌గా( Travel Agent ) ఉద్యోగం వచ్చింది.ఒకసారి హోటల్ తాజ్‌లో ఉద్యోగం కోసం వెళ్లారు.కానీ డిగ్రీ లేకపోవడంతో అక్కడ ఉద్యోగం రాలేదు.ఆ తర్వాత ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించారు.కానీ చదువు తక్కువ కావడంతో అక్కడ కూడా పని దొరకలేదు.ఒకే రోజు జాకీ బస్టాండ్‌లో నిల్చొని ఉండగా ఒకే వ్యక్తి వచ్చి మోడలింగ్ చేస్తావా అని అడిగాడు.
ఆ సమయంలో జాకీ ష్రాఫ్ చేతుల్లో డబ్బులు లేవు.చేయడానికి పని కూడా లేదు.
మోడలింగ్ చేస్తే డబ్బులు వస్తాయా జాకీ అడిగారు.వస్తాయని చెప్పడంతో.
మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు.ఒకప్పుడు ఉద్యోగం కోసం ఇంటింటికీ తిరిగిన జాకీ ష్రాప్ నేడు రూ.212 కోట్ల ఆస్తులకు యజమాని.







