తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటుల వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.మరి ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న ధనుష్( Dhanush ) కూడా ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
అయిన ఇంతకు ముందే వెంకీ అట్లూరి( Venky Atluri ) డైరెక్షన్ లో సార్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు శేఖర్ కమ్ములతో( Shekhar Kammula ) కూడా మరొక సినిమా చేసి మంచి విజయాన్ని అందుకొని అదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా( Captain Miller movie ) కూడా మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ క్రమంలోని ఆయన ఇలాంటి సినిమాలు తో మరొకసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తు సక్సెస్ కొట్టాలని డైరెక్ట్ గా తెలుగు డైరెక్టర్ల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే స్ట్రైయిట్ గా తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడనే చెప్పాలి.
నిజానికి శేఖర్ కమ్ముల కి తెలుగులో చాలా మంచి మార్కెట్ ఉంది.ఇప్పటికే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.అలాంటిది ఆయన ధనుష్ తో సినిమా చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ధనుష్ శేఖర్ కమ్ముల తర్వాత మరో స్టార్ డైరెక్టర్ తో తెలుగులో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన ఎవరు అంటే ఎన్టీయార్ తో దేవర సినిమా చేస్తున్న కొరటాల శివ ( Koratala Shiva )ధనుష్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.మరి ఇది ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.కానీ తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.








