తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక మైన గురింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే గోపీచంద్ ( Gopichand )లాంటి నటుడు కూడా తనదైన మార్క్ నటన ను చూపిస్తూ మంచి మార్కులు అయితే సంపాదించుకుంటూ వస్తున్నాడు.
ఇప్పటి వరకు ఆయన చేసిన చాలా సినిమాలు ఈనకంటూ మంచి గుర్తింపును సంపాదించి పెట్టినప్పటికీ ఆయనకి మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అయితే దక్కడం లేదు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన పక్కా కమర్షియల్ గా సినిమా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే భీమా( bheema ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా లేనప్పటికీ ఈ సినిమాతో మాత్రం పెద్ద సక్సెస్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి తను ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక దాంతో పాటుగా శ్రీనువైట్ల( Srinuwaitla ) దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కూడా తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కుతూహలం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇంతకుముందు ఆయనకు పెద్ద గా సక్సెస్ లు అయితే లేవు.మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత తను ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయంశం గా మారుతుంది.

ఎందుకంటే గోపీచంద్ ఇప్పుడు సక్సెస్ కొట్టకపోతే ఆయన కెరియర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది.యంగ్ హీరోలందరూ వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తుంటే తను మాత్రం ఒక సక్సెస్ లేకుండా ముందుకు సాగుతున్నాడు… అందుకే ఇప్పుడు తను సక్సెస్ కొట్టాల్సిన అవసరమైతే వచ్చింది.








