తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో( TFI Fans Cricket League ) భాగంగా హైదరాబాద్ లో ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ లో బాలకృష్ణ ఫ్యాన్స్( Balakrishna Fans ) జట్టు NBK లయన్స్ టీమ్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల జట్టు టైగెర్స్ XI టీమ్ విజయం సాధించింది.దాదాపుగా 97 పరుగుల సులభ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ( NTR Fans ) జట్టు సునాయసంగా విజయాన్ని సొంతం చేసుకొన్నది.
కాగా తాజాగా NBK లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టైగెర్స్ XI జట్టు టాస్ గెలిచి ఫీల్టింగ్ ఎంచుకొన్నది.దాంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది.
ఎన్టీఆర్ జట్టు( NTR Team ) సభ్యులు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో బాలయ్య టీమ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది.25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఈ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్ల కంటే ముందుగానే 18.5 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది.NBK లయన్స్ జట్టులో అత్యధికంగా శ్రీను 29 పరుగులు, ధీరజ్ 15 పరుగులు, రిస్క్ అజయ్ 17 పరుగులు చేశారు.మిగితా వారందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.
టైగెర్స్ XI జట్టులో( Tigers XI ) అత్యధికంగా తరుణ్ 3 వికెట్లు, క్విన్ష్ 2 వికెట్లు, నీరజ్ 2 వికెట్లు, సిద్దూ, హర్ష, ఏవీఆర్ చెరో వికెట్ సాధించారు.
ఇక 97 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టైగెర్స్ XI జట్టు ధాటిగా ఆడింది.ఓపెనర్లు తెగడ, ఏవీఆర్ రాణించడంతో గెలుపు సులభమైంది.ఏవీఆర్ 51 పరుగులు, తేగడ 14 పరుగులు చేసి అవుటయ్యారు.
సూర్య కిరణ్ 25 పరుగులతో, సిద్దూ నాయక్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.NBK లయన్స్( NBK Lions ) జట్టులో విక్రాంత్ రాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ జట్టుకు తొలి విజయం లభించింది.ఇదిలా ఉండగా, జనవరి 31 తేదీన తమ్ముడు XI జట్టుతో జై చిరంజీవ జట్టు, హంగ్రీ చీటా జట్టుతో NBK Fans, రోరింగ్ రెబెల్స్‌తో నాగ్ కింగ్స్, గేమ్ ఛేంజర్ జట్టుతో వెంకీ వారియర్స్ జట్టు తలపడునున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ మ్యాచ్‌లు కొనసాగుతాయి.మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.