Fahadh Faasil: పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే. ప్రొద్దుటూరులో భోజనం చేసి ఆటోలో ప్రయాణిస్తూ?

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో( Pushpa ) భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Pushpa Villain Fahadh Faasil At Andhra Pradesh Proddatur Video Viral-TeluguStop.com

అయితే పార్ట్ వన్ లో కనిపించినది అరగంట సేపు మాత్రమే అయినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు.ఆ తరువాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీలో( Vikram ) కూడా నటించి మెప్పించారు.

దీంతో ఫహద్ యాక్టింగ్ కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఇక అప్పటినుంచి ఫహద్ నటించిన పలు సినిమాలను డబ్బింగ్ తో ఓటీటీలు ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

Telugu Allu Arjun, Andhra Pradesh, Fahadh Faasil, Fahadhfaasil, Proddatur, Pushp

దీంతో ఫహద్ నటించే కొత్త సినిమాలను కూడా టాలీవుడ్ లో రిలీజ్ చేసేలా తెలుగు టచ్ ఉండేలా చూసుకుంటున్నారు.ఈక్రమంలోనే ఫహద్ నటించే కొత్త సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు లో( Proddatur ) చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాలో ఫహద్ తో పాటు మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఒక హోటల్ సన్నివేశాన్ని ప్రొద్దుటూరు సెంటర్ లో చిత్రీకరిస్తుండగా కొంతమంది ఆ షూటింగ్ ని( Shooting ) వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హోటల్ లో భోజనం చేసిన ఫహద్ అండ్ టీం.అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి బయలుదేరారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Telugu Allu Arjun, Andhra Pradesh, Fahadh Faasil, Fahadhfaasil, Proddatur, Pushp

ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం పుష్ప 2 లో( Pushpa 2 ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు.

అల్లు అర్జున్( Allu Arjun ) ఫహద్ ఫాజిల్ మధ్య జరిగే పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందని, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.కాగా పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube