Fahadh Faasil: పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే. ప్రొద్దుటూరులో భోజనం చేసి ఆటోలో ప్రయాణిస్తూ?

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) గురించి మనందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో( Pushpa ) భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

అయితే పార్ట్ వన్ లో కనిపించినది అరగంట సేపు మాత్రమే అయినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు.

ఆ తరువాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీలో( Vikram ) కూడా నటించి మెప్పించారు.

దీంతో ఫహద్ యాక్టింగ్ కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఇక అప్పటినుంచి ఫహద్ నటించిన పలు సినిమాలను డబ్బింగ్ తో ఓటీటీలు ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

"""/" / దీంతో ఫహద్ నటించే కొత్త సినిమాలను కూడా టాలీవుడ్ లో రిలీజ్ చేసేలా తెలుగు టచ్ ఉండేలా చూసుకుంటున్నారు.

ఈక్రమంలోనే ఫహద్ నటించే కొత్త సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు లో( Proddatur ) చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో ఫహద్ తో పాటు మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలోని ఒక హోటల్ సన్నివేశాన్ని ప్రొద్దుటూరు సెంటర్ లో చిత్రీకరిస్తుండగా కొంతమంది ఆ షూటింగ్ ని( Shooting ) వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హోటల్ లో భోజనం చేసిన ఫహద్ అండ్ టీం.అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి బయలుదేరారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. """/" / ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం పుష్ప 2 లో( Pushpa 2 ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు.అల్లు అర్జున్( Allu Arjun ) ఫహద్ ఫాజిల్ మధ్య జరిగే పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందని, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

కాగా పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

కనిపించింది ఒక్క సెకన్.. అంచనాలు మాత్రం పెరిగాయి.. ప్రభాస్ కు టాలీవుడ్ లో తిరుగులేదుగా!