డెలివరీ( Delivery ) అనంతరం చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ ఫాల్ అనేది ముందు వరుసలో ఉంటుంది.అందులోనూ కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.
దీంతో ఎంతో ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పల్చగా తయారైపోతుంది.డెలివరీ తర్వాత జుట్టు విపరీతంగా రాలడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్ వేధిస్తూ ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వాడారంటే ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా పది వెల్లుల్లి రెబ్బలను( Garlic ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.అలాగే ఒక కలబంద ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut oil ) వేసుకోవాలి.అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు మరియు కలబంద ముక్కలు వేసి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకోవాలి.
ఈ ఆయిల్ ను తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలిక పాటి షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడారంటే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే దూరం అవుతుంది.డెలివరీ అనంతరం విపరీతంగా జుట్టు రాలుతుంది అని బాధపడుతున్న వారికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.