దాదాపు ప్రతి ఒక్కరూ తమ ముఖ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా( Skin Whitening and Brightening ) మెరిపించుకోవాలని ఆరాటపడుతుంటారు.ఇందులో భాగంగానే ఖరీదైన క్రీమ్, సీరంలను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అలాగే నెలకు ఒకటి రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.ప్రతి నెలా స్కిన్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ రోజు నైట్ మిల్క్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే పైసా ఖర్చు లేకుండానే చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

పాలు( Milk ) ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా తోడ్పడతాయి.పాలల్లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే వైట్ అంటే బ్రైట్ స్కిన్ కోసం మిల్క్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
నైట్ నిద్రించడానికి ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా రిమూవ్ చేసి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.
మరుసటి రోజు గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్రతిరోజూ కనుక చేశారంటే కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ టోన్( Skin Tone ) మెరుగుపడుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే ఈ మిల్క్ క్రీమ్ ను నిత్యం వాడటం వల్ల ముడతలు, చర్మం సాగటం, చర్మంపై గీతాలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
మరియు స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.షైనీ గా మెరుస్తుంది.