టీలో ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుందట.. యూఎస్ సైంటిస్ట్ చెబుతోందిగా!

టీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టపడే ఒక హాట్‌ డ్రింక్.ముఖ్యంగా శీతాకాలంలో ప్రజలు టీ( Tea ) తాగుతూ వెచ్చదనాన్ని పొందుతారు.

 American Scientist Suggests Tea With Salt Recipe Details, Trending News, Michell-TeluguStop.com

టీ తలనొప్పిని కూడా తగ్గించగలదు.టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది, ఇది చైనాలో( China ) ప్రారంభమైంది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల రుచులతో టీ దొరుకుతోంది.

కొంతమంది తమ టీలో ఏలకులు, అల్లం వంటి మసాలా దినుసులను జోడించడానికి ఇష్టపడతారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమెరికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మిచెల్ ఫ్రాంకీ( Michelle Francl ) టీని మరింత రుచికరంగా చేయడానికి ఉప్పు అందులో మిక్స్ చేయాలని చెప్పి షాక్ ఇచ్చింది.

ఉప్పు టీలోని చేదును తగ్గించి ఎక్కువ రుచికరంగా చేస్తుందని ఆమె చెప్పింది.డాక్టర్ ఫ్రాంకీ టీని ఎలా తయారుచేయాలో కూడా చెప్పింది.ఫ్రూట్ టీలలో సాల్ట్( Salt ) కలుపుకుంటే రుచి బాగుంటుందని ఆమె చెప్పింది.

ఇతర టీలలో కూడా ఉప్పు మిక్స్ చేయొచ్చని తెలిపింది.చాలామంది టీలో షుగర్( Sugar ) వేస్తే టీ పొడి వగరు లేదా చేదు పోతుందని అనుకుంటారని కానీ ఉప్పు ఆ టీ వగరు మరింత సమర్థవంతంగా పోగొడుతుందని డాక్టర్ మిచెల్ చెబుతోంది.ఆమె ప్రకారం, టీని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి.

టీలో ఒక చెంచా ఉపయోగించి పాలు వేగంగా కలపాలి.

డాక్టర్ మిచెల్ ప్రకారం, టీ బాగా రుచిగా ఉంటుంది, కప్పును వేడిగా ఉంచితే యాంటీఆక్సిడెంట్, కెఫిన్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.టీ కప్పును ముందుగా వేడి నీళ్లతో నింపి, దానిని ఖాళీ చేసే ముందు కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలని, అప్పుడు బ్యాక్టీరియా వంటివి చచ్చిపోతాయని ఆమె సలహా ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube