మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం( Guntur Kaaram ).త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలోకి విడుదల అయిన సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.
ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ పడుతూలేస్తూ సాగుతోంది.నా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి కనీసం ఇంకా నెలరోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ లోకి రాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

వచ్చే నెల ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్( Mahesh Babu Fans ) మరోసారి అలర్ట్ అయ్యారు.మహేష్ అభిమానులు ఇప్పుడు ఓటీటీ కోసం సరికొత్త డిమాండ్స్ ను తెరపైకి తెస్తున్నారు.
ఇంతకీ ఆ డిమాండ్స్ ఏంటి అన్న విషయానికొస్తే.గుంటూరు కారం సినిమా కోసం చాలా సన్నివేశాలు తెరకెక్కించి పక్కన పెట్టారు.
రీ రికార్డింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని సీన్లు తొలిగించారు.అలా డిలీట్ చేసిన సన్నివేశాల్ని కూడా ఓటీటీలో రిలీజ్( Guntur Kaaram OTT Release ) చేయమని కోరుతున్నారు ఫ్యాన్స్.

దీంతో పాటు సినిమా అన్-కట్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంతకుముందు లియో, యానిమల్ సినిమాలు కూడా ఇలానే వచ్చాయి.అయితే ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు గుంటూరు కారం ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు.త్వరలోనే గుంటూరు కారం స్ట్రీమింగ్ డేట్ బయటకు రాబోతోంది.
నెట్ ఫ్లిక్స్( Netflix) ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.అయితే విడుదల తేదీ ఎప్పుడు అన్నది తెలీదు.
మరి అభిమానుల డిమాండ్ మేరకు ఈ సినిమాను డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి విడుదల చేస్తారా లేదా చూడాలి మరి.







