ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో నారాయణ రాజు, కనకదుర్గ ( Narayana King, Kanakadurga )దంపతుల కు జన్మించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Verma ).నారాయణ రాజు సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తుండగా, ప్రశాంత్ వర్మ తల్లి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పని చేస్తారు.
ఇక ప్రశాంత వర్మకి స్నేహ సమీరా అనే ఒక సిస్టర్ కూడా ఉంది.షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రశాంత్ మొదట దీనమ్మ జీవితం అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు.
ఆ తర్వాత మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ అతనికి మంచి పేరుని తీసుకొచ్చాయి.యఫ్ టివి కోసం బ్రియాన్ లారా నాటౌట్ ( Brian Laura not out )అనే ఒక సిరీస్ ని సైతం డైరెక్ట్ చేశాడు పలు యాడ్స్, ఎండార్స్మెంట్స్ కూడా డైరెక్ట్ చేసి తన స్కిల్స్ ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు ప్రశాంత్ వర్మ.

ఇక నానికి ప్రశాంత్ వర్మ ‘ అ ‘ సినిమా కథ చెప్పి ఒప్పించగా దానికి కొన్ని అవార్డ్స్ కూడా దక్కాయి.ప్రశాంత్ చెప్పిన కథతో నాని చాలా బాగా కన్విన్స్ అయ్యాడు.దాంతో అతడే ప్రొడ్యూసర్ గా ప్రశాంత్ వర్మని డైరెక్టర్ గా పరిచయం చేశాడు.ఆ తర్వాత రాజశేఖర్ తో కల్కి మరియు తేజా సజ్జా తో జాంబి రెడ్డి అనే సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా హనుమాన్ ( Hanuman )సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేశాడు.
హనుమాన్ సినిమా విజయవంతం అయిన తర్వాత తన తదుపరి చిత్రం జై హనుమాన్ అంటూ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించగా దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది.

ఇక ప్రశాంత్ వర్మ ఇప్పటికీ సింగిల్ అని అందరూ అనుకుంటున్నారు కానీ అతడికి పెళ్లయింది.2020 లోనే సుకన్య రాజు ( Sukanya )అనే ఆంధ్రకు చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు.హనుమాన్ సినిమా కి సంబంధించిన ఈవెంట్ల లో కూడా సుకన్య కనిపించింది.
ఇక సుకన్య సచ్ బై సుకన్య రాజు చేకూరి అనే ఒక బ్రాండ్ ని కలిగి ఇండో వెస్టర్న్ బ్రాండ్స్ కి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా సుకన్య రాజు టాప్ లో ఉన్నారు.
పైగా హీరోయిన్స్ కన్నా కూడా ప్రశాంత్ వర్మ భార్య సుకన్య అందంగా ఉండటం విశేషం.







