సాధారణంగా చిన్న సినిమాలు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను సాధించడం అరుదుగా జరుగుతుంది.చిన్న సినిమా పెద్ద విజయం సాధించినంత మాత్రాన ఆ నిర్మాతకు ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పడానికి వీలు లేదు.
గతేడాది పెద్ద హిట్ గా నిలిచిన సినిమాలలో బేబీ సినిమా( Baby movie ) ఒకటి.బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే బేబీ నిర్మాత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.పోస్టర్ల మీదే కలెక్షన్లు ఉన్నాయని జేబుల్లోకి రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.బేబీ నిర్మాత చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు( Distributors, Exhibitors ) లాభాల్లో నిర్మాతకు ఇవ్వాల్సిన వాటాను అనుకున్న విధంగా ఇవ్వకపోవడంతో ఈ తరహా సమస్యలు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బేబీ నిర్మాత తెలుగులోకి ట్రూ లవర్ అనే క్రేజీ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిర్మాత ఎస్కేన్( Producer Escan ) మరో కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.తమిళంలో లవర్ పేరుతో ఈ సినిమా రిలీజవుతోంది.ఈ జనరేషన్ యూత్ ను టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉండటం గమనార్హం.ట్రూ లవర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మణికందన్, గౌరీప్రియ లీడ్ రోల్స్ లో ఈ సినిమా తెరకెక్కింది.వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బేబీని మించిన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ట్రూ లవర్ సినిమా ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.
ట్రూ లవర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఎస్కేఎన్ కు ఈ సినిమా ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి.







