మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) రీఎంట్రీలో నటించిన సినిమాలలో ఆచార్య, భోళా శంకర్( Acharya, Bhola Shankar ) సినిమాలు తీవ్రస్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మాస్ సినిమాలు అయినా సక్సెస్ సాధించగా ఇతర సినిమాలతో మెప్పించే విషయంలో చిరంజీవి ఫెయిల్ అయ్యారు.
అయితే చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో విశ్వంభర మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా చిరంజీవి షూట్ లో పాల్గొననున్నారు.చిరంజీవి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడవడం అంటే అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగే ఛాన్స్ అయితే ఉంది.

చిరంజీవి షూట్ లో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన ఏవైనా అప్ డేట్స్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.విశ్వంభర( vishwambara ) సినిమాలో గూస్ బంప్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

విజువల్ ఎఫెక్స్ట్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలు అనుకున్న టార్గెట్ ను రీచ్ కావడం సులువు కాదు.అందువల్ల విశ్వంభర మూవీ షూట్ శరవేగంగా జరిగితే మాత్రమే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి.విశ్వంభర చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.విశ్వంభర చిరంజీవి రేంజ్, ఇమేజ్ ను పది రెట్లు పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.







