వైరల్ వీడియో: ఈ చిన్నారి ఆడుతున్న గేమ్ ఏ మనిషికి సాధ్యం కాదు..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ప్రపంచాన్ని ఊహించని విధంగా మార్చేస్తోంది ఇప్పటికే ఎన్నో మార్పులు దీనివల్ల కలిగాయి.ఇది గేమింగ్‌ను కూడా సమూలంగా మార్చేస్తోంది.

 Watch How This Girl Playing Dangerous Game Video Viral Details, Artificial Intel-TeluguStop.com

AI కారణంగా గేమింగ్( Gaming ) చాలా మారిపోయింది.AI గేమ్స్‌ను మరింత రియలిస్టిక్, ఫన్‌గా మార్చగలదు.

రియల్ వరల్డ్‌లో జరుగుతున్నట్లుగా కనిపించే గేమ్‌లను కూడా AI తయారు చేయగలదు.

ఉదాహరణకు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయి చాలా ప్రమాదకరమైన గేమ్‌ను ఆడుతున్నట్లు ఓ వైరల్ వీడియోలో కనిపించింది.

వీడియో ప్రకారం ఆమె కదులుతున్న, తిరుగుతున్న స్క్వేర్ బాక్స్ లపై( Square Boxes ) దూకుతోంది.ఆమె కాళ్ల కింద స్క్వేర్ బాక్సులు తప్ప మిగతాదంతా ఒక గుంట లాగా ఉన్నట్లు కనిపించింది.

చిన్నారి దానిపై గెంతుతూ ఆడుకుంటుంటే ఎక్కడ పడిపోయి చచ్చిపోతుందేమో అనే భయం కలిగింది.

కానీ ఇది నిజమైన ఆట కాదు.ఇది విజువల్ ఎఫెక్ట్స్( Visual Effects ) లేదా VFX అనే మరొక సాంకేతికత ద్వారా చేసిన ట్రిక్.VFX నిజమైన వ్యక్తులను, వస్తువులను ఫేక్ చిత్రాలతో మిళితం చేసే వీడియోలను రూపొందించగలదు.

ఈ విధంగా, VFX అద్భుతమైన, అసాధ్యం అనిపించే వీడియోలను చేయవచ్చు.

సినీ యాక్టర్స్ ఎగరడం లేదా రాక్షసులతో పోరాడటం వంటి పనులు చేసే అనేక సినిమాల్లో కూడా VFXని చూడవచ్చు.VFX ఈ దృశ్యాలను వాస్తవికంగా, నమ్మదగినదిగా మార్చేస్తుంది.చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి కంగు తిన్నారు.

ఈ గేమ్ ఆడటం ఈ చిన్నారికి తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరికొందరు పేర్కొన్నారు.ఇది నిజమే అనుకొని భయపడ్డామని మరికొందరు పేర్కొన్నారు.

నిజానికి ఈ వీడియో వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు.తర్వాత అసలు సంగతి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube