విపక్షాల ఇండియా కూటమి( India Alliance )కి మరో షాక్ తగిలింది.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేరిందని తెలుస్తోంది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) ఆప్ కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిందని సమాచారం.

సీట్ల పంపకంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ విఫలం అయిందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( West Bengal Mamata Banerjee ) విమర్శించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.ప్రస్తుతం తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ( Trinamool Congress ) బాటలోనే ఆప్ కూడా నడుస్తోందని సమాచారం.







