రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ లో భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో రాస్తా రోకో ధర్నాను విద్యార్థులతో కలిసి నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ బస్సులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
గంటల కొద్దీ ఎదురు చూపులు చూస్తున్నారు.దీని వల్ల కొన్ని క్లాస్ లకు అటెండ్ కాలేక పోతున్నారు.
అంతే కాకుండా విద్యార్థులకు పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని పలుమార్లు ఆర్టీసీ డిపో అధికారులను కోరడం జరిగింది.
ఇప్పటికి అయిన విద్యార్థుల బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని డిమాండ్ చేశారు.
బస్సులు వేయని ఎడల విద్యార్థులతో కలిసి డిపో ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.ఆర్టీసీ అధికారులు దీనికి స్పందించి సరియైన సమయంలో బస్సులు నడిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ నరేష్ జగన్ తిరుపతి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.