భారత క్రికెట్ కు రవిశాస్త్రి( Ravi Shastri ) చేసిన సేవలకు గుర్తుగా బీసీసీఐ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది.రవి శాస్త్రి తన రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా, కోచ్ గా భారత జట్టుకు సేవలు అందించాడు.
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ తన క్రికెట్ కెరియర్ లో మరుపురాని క్షణాలు చాలానే ఉన్నాయని చెబుతూ తీవ్ర భాగోద్వేగానికి గురయ్యాడు.గబ్బా టెస్ట్( Gabba Test ) లో భారత క్రికెట్ జట్టు గెలవడం ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ తనకు ఎప్పటికీ గుర్తు ఉంటాయని చెప్పుకొచ్చాడు.

1985లో మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనదని చెప్పాడు.1983లో భారత్ ప్రపంచ కప్ గెలవడం తనను చాలా సంతోషపరిచిందని, అది ఎప్పటికీ మరువలేనని చెప్పాడు.ఆస్ట్రేలియాపై డబల్ సెంచరీ, వెస్టిండీస్ పై సెంచరీ.ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నాడు.

రవిశాస్త్రి భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యాఖ్యాతగా, కోచ్ గా భారత జట్టుకు సేవలు అందించాడు.కోచ్ గా పని చేసిన సమయంలో కూడా మరుపురాని క్షణాలు చాలానే ఉన్నాయి.2007లో టీ20 ప్రపంచ కప్ విజయం, 2011లో మహేంద్రసింగ్ ధోని సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించడం, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టు సిరీస్ విజయాలను భారత్ గెలవడం.

రవిశాస్త్రి 17 ఏళ్ల వయసులో క్రికెట్ మొదలుపెట్టాడు.30 సంవత్సరాల వయసులో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.తనకు ఎల్లవేళలా బీసీసీఐ అండగా నిలిచింది.
తాను దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణం అని, ఈ 40 ఏళ్లలో బీసీసీఐ ఊహించని విధంగా ఎదగడం ప్రపంచ క్రికెట్ కు పవర్ హౌస్ గా మారడం చాలా ప్రత్యేకమైన సందర్భం అని రవిశాస్త్రి మాట్లాడుతూ భాగోద్వేగానికి గురయ్యాడు.