ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం మరి కాసేపటిలో ఆవిష్కృతం కానుంది.అయోధ్యలో బాల రాముని విగ్రహా ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభమైంది.
అయోధ్య రామ మందిరానికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi )బాలరామునికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం మరియు పాదుకలు తీసుకువచ్చారు.

ప్రధాన అర్చకులకు వాటిని అప్పగించిన అనంతరం మోదీ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు.కాగా మరి కాసేపట్లో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.







