అయోధ్య శ్రీరామునికి పట్టువస్త్రాలు, ఛత్రం..!

ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం మరి కాసేపటిలో ఆవిష్కృతం కానుంది.

అయోధ్యలో బాల రాముని విగ్రహా ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభమైంది.అయోధ్య రామ మందిరానికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi )బాలరామునికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం మరియు పాదుకలు తీసుకువచ్చారు.

"""/" / ప్రధాన అర్చకులకు వాటిని అప్పగించిన అనంతరం మోదీ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు.

కాగా మరి కాసేపట్లో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.