భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) కొంతమంది సెలబ్రిటీల బాటలో నడుస్తూ ఆస్తులు కుడబెట్టుకుంటున్నాడు.ప్రస్తుతం క్రికెట్, సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలంతా రియల్ ఎస్టేట్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగణ్, కాజోల్, కార్తిక్ ఆర్యన్ లాంటి వారంతా ముంబై నగరంలో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.వీరి బాటలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబై నగరంలో భారీగానే ప్రాపర్టీలు కొనుగోలు చేశాడు.

ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రోహిత్ శర్మకు రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి.ఆ అపార్ట్మెంట్లను మూడేళ్ల వ్యవధికి లీజుకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ రెండు అపార్ట్మెంట్లు 14వ అంతస్తులో 1047 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
రోహిత్ శర్మ ఈ రెండు అపార్ట్మెంట్లను 2022లో నెలకు 2.5 లక్షలకు అద్దెకు ఇచ్చాడు.తాజాగా ఈ 2024లో మూడేళ్ల వ్యవధికి ఈ రెండు అపార్ట్మెంట్లను లీజుకు ఇచ్చాడు.ఈ అద్దె మొదటి సంవత్సరం ప్రతినెలకు రూ.3.1లక్షలు.రెండవ సంవత్సరం ప్రతి నెలకు రూ.3.25 లక్షలు.మూడవ సంవత్సరం ప్రతి నెలకు రూ.3.41 లక్షలు.ఈ ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ 2024 జనవరి 24న జరిగినట్లు సమాచారం.లీజుకు తీసుకున్న అద్దెదారు డిపాజిట్ రూపంలో అడ్వాన్స్ కింద రూ 9.3 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

భారత దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలు ఆస్తులు కొనుగోలు చేయడం, వాటిని లీజుకు ఇవ్వడం చాలా సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది.బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్ ముంబై నగరంలోని తమకు ఉండే ప్రాపర్టీలను లీజుకు ఇచ్చినట్లు సమాచారం.







