Ram Charan: 100 కోట్లు ఆఫర్ చేసిన చరణ్ సినిమాను రిజెక్ట్ చేసిన నటి… ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ (Ram Charan) ఒకరు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో నటించినటువంటి RRR సినిమా ద్వారా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈయన గ్లోబల్ స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.

 Star Heroine Deepika Padukone Rejected Ram Charan Movie-TeluguStop.com
Telugu Buchi Babu Sana, Game Changer, Priyanka Chopra, Ram Charan, Ramcharan, Sa

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం గేమ్ చేంజర్(Game Changer) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ( Kiara Advani ) నటిస్తున్నారు.

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన( Buchibabu Sana ) దర్శకత్వంలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Buchi Babu Sana, Game Changer, Priyanka Chopra, Ram Charan, Ramcharan, Sa

ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఏ హీరోయిన్ నటించబోతున్నారు అనే విషయం గురించి తరచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే సాయి పల్లవి పేరు కూడా తెరపైకి వచ్చింది.

అదేవిదంగా బాలీవుడ్ హీరోయిన్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.ఇకపోతే గతంలో రామ్ చరణ్ తో నటించడం కోసం బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను సంప్రదించడంతో ఈమె తన పక్కన నటించడానికి రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

Telugu Buchi Babu Sana, Game Changer, Priyanka Chopra, Ram Charan, Ramcharan, Sa

బాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఇదివరకు తుఫాన్( Toofan Movie ) అనే సినిమాలో నటించారు.ఇందులో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) నటించారు.ప్రియాంక కంటే ముందుగా ఈ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) ను మేకర్ సంప్రదించారట అయితే అప్పట్లో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఈమెకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుంది ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ దీపికా పదుకొనే రామ్ చరణ్ తో నటించడానికి వెనకడుగు వేశారట ఈమె రిజెక్ట్ చేయడంతో ప్రియాంక చోప్రాను తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా క్రేజ్ లేకపోవడంతో తిరిగి బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube