కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. విజయవాడలోని రమ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ దీక్ష మూడో రోజుకు చేరుకుంది.
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.అన్యాయంగా జైల్లోనే ఉంచుతున్నారని వాపోతున్నారు.
ఈ క్రమంలో శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు.

శ్రీనివాస్ ను విడుదల చేసేంత వరకు తమ దీక్ష కొనసాగుతోందని వారు చెబుతున్నారు.సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించి కోర్టుకు వచ్చి వాంగ్మూలాన్ని ఇవ్వాలని, తన కొడుకును విడిపించాలని కోరుతున్నామని తెలిపారు.







