ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్( Amazon ) కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.అయోధ్య ప్రసాదం పేరుతో మోసపూరిత విక్రయాలు చేస్తోందని నోటీసుల్లో పేర్కొంది.

అమెజాన్ లోశ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం( Ram Mandir prasad ), అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాదం మరియు ఖోయా ఖోబీ ల్డడూ విక్రయానికి ఉన్నాయి.కాగా నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గానూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( Central Consumer Protection Authority )వారం రోజులు గడువు ఇచ్చింది.కేంద్రం జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని సీసీపీఏ హెచ్చరించింది.







