అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్..!

అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత జట్టు తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ ( Bangladesh )తో ఆడనుంది.దక్షిణాఫ్రికా లోని బ్లూమ్ ఫోంటైన్ లోని మంగాంగ్ ఓవల్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది.

 India Vs Bangladesh Match Today As Part Of Under-19 World Cup , World Cup, India-TeluguStop.com

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ఈ అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

అదే డిజిటల్ లో అయితే డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక అండర్-19 ప్రపంచకప్ లో భారత జట్టుకు మంచి రికార్డులే ఉన్నాయి.

భారత జట్టు ఇప్పటివరకు ఏకంగా ఐదు సార్లు అండర్-19 ప్రపంచకప్ టైటిల్( Under-19 World Cup title ) ను ముద్దాడింది.ఇక ఆరోసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా భారత జట్టు బరిలోకి దిగనుంది.

ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్ లోనే ఉంది.ఇటీవల జరిగిన ట్రై సిరీస్ గెలుచుకుంది.అండర్ 19 ప్రపంచ కప్ ఆడే భారత జట్టుకు ఉదయ్ సహారన్ నాయకత్వం( Uday Saharan leadership ) వహించనున్నాడు.భారత జట్టులో ఆల్ రౌండర్ ముషీర్ ఖాన్, అర్మిన్ కులకర్ణి( Mushir Khan, Armin Kulkarni ) మంచి ఫామ్ లో ఉండడం భారత్ కు సానుకూలాంశం.

ఇటీవలే స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 టైటిల్ ను భారత్ త్రుటిలో మిస్ చేసుకుంది.అయితే అండర్ 19 రూపంలో ప్రపంచ కప్ ను ముద్దాడే సువర్ణ అవకాశం మళ్లీ వచ్చింది.

నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయలేం.ఇటీవలే జరిగిన ఆసియా కప్ అండర్-19 సెమీఫైనల్ లో భారత జట్టుకు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కాబట్టి భారత జట్టు ప్రతి మ్యాచ్లో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా, ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తే.భారత్ కచ్చితంగా మరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ ను ముద్దాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube