టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ), స్టార్ హీరోయిన్ రష్మిక మందనల( Rashmika Mandana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా గీతా గోవిందం సినిమా( Geetha Govindam movie ) తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి.అందుకు అనుగుణంగానే రష్మిక విజయ్ ఎప్పటికప్పుడు వాటికి ఆజ్యం పోస్తూ ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడం ఇద్దరు కలిసి ఒకే విధమైన షర్ట్లు వేసుకోవడం లాంటివి చేయడంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి.
ఇకపోతే గతంలో చాలాసార్లు విజయ్ దేవరకొండ రష్మిక ల ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అంటూ రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.కానీ ఎప్పటికప్పుడు రష్మిక విజయ్ లు ఆ వార్తలకు చెక్ పెడుతూ వచ్చారు.ఇది ఇలా ఉంటే ఫిబ్రవరిలో విజయ రష్మిక నిశ్చితార్థం జరగబోతోంది అంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.దీనిపై విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినా ఇవి ఆగడం లేదు.
దాంతో ఆ వార్తలతో విసిగిపోయిన విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు.ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు.
ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ.ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు.ప్రతీ రెండేళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లు ఉన్నాయి.వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు.
ప్రతి ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నాను అని తెలిపారు విజయ్ దేవరకొండ.