కొంతమంది సైక్లిస్టులు గ్రామీణ ప్రాంతాలలో వివిధ మార్గాల్లో స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా( Social media )లో షేర్ చేస్తుంటారు.ఈ మార్గాలలోని కర్వ్స్, సర్‌ప్రైజులు సైక్లిస్టులను ఆశ్చర్య పరుస్తాయి.
ఈ వీడియోలను చూసేవారు కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఫీల్ అవుతారు.అయితే ఒక సైక్లిస్ట్ మాత్రం కటిక చీకట్లలో అడవిలో సైకిల్ ఫీట్లు చేసి ఆ వీడియోను షేర్ చేసుకున్నాడు.
అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
రాత్రి సమయంలో చాలా ఇరుకైన ట్రయల్‌లో రైడింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో అతడు పోస్ట్ చేయగా ఫాలోవర్లు అది చూసి చాలా భయాందోళనకు గురయ్యారు.ఇంత ప్రమాదకరమైన పని ఎందుకు చేస్తాడని వారు ప్రశ్నించారు.బైక్‌పై చిన్నపాటి లైట్‌తో అడవి గుండా వెళుతున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు.
కొంతమంది అతనిని ధైర్యవంతుడి అని మెచ్చుకున్నారు, అయితే మరికొందరు అతని భద్రత గురించి ఆందోళన చెందారు.
ఈ రిస్కీ స్టంట్ చేసిన సైక్లిస్ట్ పేరు రెమీ మెటైలర్( Remy Metailler ) ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రాత్రి వేళల్లో తాను కష్టతరమైన ట్రయల్‌లో రైడింగ్ చేస్తున్నానని చెప్పాడు.తన రైడ్ ఎంత ఒత్తిడితో కూడుకున్నదో రేటింగ్ ఇవ్వాలని ప్రజలను కోరాడు.వీడియోకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దీనిపై చాలా మంది కామెంట్స్ చేశారు.ఈ వీడియో చూస్తేనే తమకు ఊపిరాగుతోందని, ఈ అడవిలో ఇలాంటి ఎరుకైనా ప్రాంతాల్లో రాత్రివేళ వెళ్లడానికి బహుశా దెయ్యాలు కూడా భయపడతాయేమో అని మరి కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
కొంచెం తేడా వచ్చినా చనిపోయే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు.రెమీ మెటైలర్ వీడియో చాలా మందిని భయపెట్టింది.
దానిని మీరు కూడా చూసేయండి.