టీడీపీ నేత దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సీతక్కలను చూసి కొడాలి నాని, కేశినేని నాని బుద్ది తెచ్చుకోవాలని సూచించారు.
గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన రా కదలి రా సభ విజయవంతం కావడంతో కొడాలి నాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.వైసీపీ నేతలు ఇసుక, మట్టి దందాలతో వందల కోట్లు దోచేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా క్యాసినోతో కొడాలి నాని కృష్ణా జిల్లా పరువు తీస్తున్నారని విమర్శించారు.గుడివాడ సభ సక్సెస్ తో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు.
అందుకే అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.







