చందు మొండేటి( Chandu mondeti ) దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న సినిమా తండేల్( Tandel )…ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా అలాగే ఒక కీలకపాత్రలో తమిళ నటుడు అయిన విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )నటిస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు తమిళ్ సినిమా ( Tamil movie )ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంతానం( santanam ) కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది సినిమా యూనిట్ ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉంచుతూ వస్తుంది.ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాకి ఎటు చూసినా కూడా పాజిటివ్ వైబ్స్ రావడంతో ఈ సినిమాతో నాగచైతన్య భారీ సక్సెస్ ని కొట్టబోతున్నాడు అంటూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో నాగచైతన్య( Naga Chaitanya ) తనని తాను స్టార్ హీరోగా ప్రజెంట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అందుకే ఈ సినిమాలో అన్ని రకాల యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్ని ఉండేవిధంగా ఈ సినిమాని నాగ చైతన్య వన్ మాన్ షో గా నడిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది… ఇక ఈ సినిమా నాగ చైతన్య ఒక భారీ సక్సెస్ ని సాధిస్తాడనే ధీమాని వ్యక్తం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక చందు మొండేటి కూడా ఈ సినిమా తో మరో భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…
.







