బీఆర్ఎస్ నేతలకు కుట్రలు, కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్య..: మంత్రి జూపల్లి

మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Conspiracies And Conspiracies For The Leaders Of Brs Education..: Minister Jupal-TeluguStop.com

హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని మంత్రి జూపల్లి తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు.

అలాగే బీఆర్ఎస్ నేతలకు కుట్రలు, కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు.

అధికారంలోకి రాగానే రెండు హామీలను అమలు చేశామన్నారు.గతంలో పార్టీకి నష్టం జరిగినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube