సాధారణంగా పెంపుడు కుక్కలు( Pet Dogs ) తమ యజమాని ఇంట్లోకి వేరొక కుక్కలను రానివ్వవు.కుక్కలను మాత్రమే కాదు ఏ జంతువులను తమ ఇంట్లోకి రావడానికి అవి ఇష్టపడవు యజమాని ప్రేమ అంతా తమకే దక్కాలనుకుంటాయి.
కొత్త కుక్కలను తీసుకొస్తే ఇవి ఎంతో బాధపడతాయి ఇంత మనం ఇంటి నుంచి బయటికి పంపిస్తారేమో తమను ప్రేమగా చూసుకోరేమో అని కుమిలి పోతాయి.కొత్త జంతువులను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇవి ఎంతగా బాధపడతాయో కళ్లకు కట్టినట్లు చూపించే ఒక ఎమోషనల్ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో యజమాని ఒక దూడను( Calf ) దత్తత తీసుకొని దానిని కారు ఎక్కించడం మనం చూడవచ్చు.కారు ముందు సీట్లో కుక్క ఉంది.
ఈ దూడను చూసి ఆ కుక్క ఎంతో బాధపడిపోయింది తన స్థానంలో ఈ ఆవును తీసుకొచ్చుకుంటున్నారేమో అని అనుకొని వెక్కివెక్కి ఏడ్చేసింది.యజమాని ( Dog Owner ) దాని మెడ పై చేయి వేసి నిన్ను ఎక్కడికి పంపించను అంటూ ఓదార్చడానికి ట్రై చేసిన పాపం అది అర్థం చేసుకోలేక అంతే ఏడ్చింది.

“నేనొక ఆవు దూడను( Baby Cow ) దత్తత తీసుకున్నాను.అది చూసి నా కుక్క బాన్‌డిట్ బాధపడుతోంది.తనని బయటికి పంపించేసి ఈ ఆవు దూడనే పెంచుకుంటానేమో అని బాధపడుతూ ఏడ్చేస్తోంది.” అని యజమాని అన్నట్లుగా ఈ వీడియోలో వివరించారు.ఈ వీడియో చూసిన చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.

“ఇప్పుడు ఇలా ఏడ్చింది కదా, తర్వాత దాని ఫీలింగ్ ఏంటో చూపించాలి.అది ఆవుకి ఫ్రెండ్ అయ్యిందా? ఆ హ్యాపీ మూమెంట్స్ చూడాలనిపిస్తుంది.” అని నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో అడిగారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూడండి.







