సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి( laxmi parvathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కు వారసుడని ఆమె అన్నారు.
గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారంటూ 2009 ఎన్నికల గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చెప్పులు వేసి అవమానించి 29 సంవత్సరాలు అయిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
కుటుంబమంతా ఎన్టీఆర్ ను చంపేసి వాళ్లే మళ్లీ ఎన్టీఆర్ కు దండలు వేస్తున్నారని ఆమె అన్నారు.తనను బూచిగా చూపించి మహనీయుడు ఎన్టీఆర్ నుంచి పదవిని లాక్కున్నారని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
లక్ష్మీ పార్వతి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను వెలేశారని జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన పేరును చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ దారి తెలుగుదేశం దారి వేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ నుంచి సైతం దేవర ( Devara )ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య ప్రవర్తన గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కెరీర్ పరంగా ఎదుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉంటూ అంతకంతకూ ఎదుగుతున్నారు.రాబోయే రోజుల్లో తారక్ మరిన్ని విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.దేవర సినిమా ఈ ఏడాదే విడుదల కానుండగా ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.బాలయ్యకు( Balakrishna ) అహంకారం అని లక్ష్మీపార్వతి కామెంట్లు చేశారు.
లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ల విషయంలో బాలయ్య లేదా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.లక్ష్మీపార్వతి ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.