నల్గొండ జిల్లా:మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో బెల్టు షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు.అనంతరం గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బెల్ట్ షాపులు మూసేయాలని ఇటీవల నల్లగొండ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాత్రి సమయంలో కొరటికల్ గ్రామస్థులతో సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే.
దీనితో బెల్టు షాపుల నిర్ములన కమిటీగా ఏర్పడిన మహిళలు బెల్టు షాపులు నడపొద్దంటూ యుద్ధం ప్రకటించారు.