చిరంజీవి ఫామ్ హౌస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.. అన్ని రూ.కోట్లు ఖర్చైందా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా చిరంజీవి వార్తల్లో నిలిచారు.చిరంజీవి తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్ గా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

 Interesting And Shocking Facts About Chiranjeevi Farm House Details Here , Chir-TeluguStop.com

అయితే చిరంజీవి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న ఆ ఫామ్ హూస్ విలువ ఏకంగా 30 కోట్ల రూపాయలు అని సమాచారం.

ఈ విషయం తెలిసి కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతుండగా మరి కొందరు మాత్రం చిరంజీవి రేంజ్ కు 30 కోట్ల రూపాయల ఖర్చు పెద్ద విషయం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.సంక్రాంతి సంబరాలలో అల్లు అరవింద్, రామ్ చరణ్, బన్నీ పాల్గొన్నారు.

బెంగళూరు( Bengaluru )కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఈ ఫామ్ హౌజ్ ఉందని సమాచారం అందుతోంది.ఈ ఫామ్ హౌజ్ లో ఆచార్య సినిమా షూటింగ్ జరిగిందని భోగట్టా.మరోవైపు చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతోందని క్లారిటీ వచ్చేసింది.యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి తర్వాత సినిమాలు సైతం భారీ స్థాయిలో, భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.

త్వరలో మెగాస్టార్ కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

చిరంజీవి వరుస సినిమాలతో బిజీ కావాలని ఆయన ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.యంగ్ జనరేషన్ హీరోలను మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సహించడంపై కూడా పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మెగా హీరోలు ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube