అయోధ్య రామ మందిరం పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. రాముడు అక్కడే ఉంటాడా అంటూ?

వెండితెర పై నటుడిగా కొనసాగి పలు సినిమాలలో నటించినటువంటి నటుడు శివాజీ(Shivaji) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఇటీవల బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శివాజీ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Sivaji Sensational Comments On Ayodhya Ram Mandir Details, Shivaji, Ayodhya, Ram-TeluguStop.com

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివాజీ అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Ayodhya, Bjp, Nature, Ram Mandir, Shivaji, Sivajiayodhya, Sivaji, Sri Ram

జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే.అయితే కొందరు మాత్రం ఈ విషయంపై రాజకీయ విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రజల మత విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకొని బిజెపి ప్రభుత్వం( BJP Govt ) రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతుంది అంటూ ఈ విషయంపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా అయోధ్య రామ మందిరం గురించి నటుడు శివాజీ కూడా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అయోధ్యలో మాత్రమే రాముడు ఉంటాడా మరి ఎక్కడ రాముడు లేరా మా ఊర్లో కూడా రామాలయం ఉంది అంటూ ఈయన వెల్లడించారు.

Telugu Ayodhya, Bjp, Nature, Ram Mandir, Shivaji, Sivajiayodhya, Sivaji, Sri Ram

భారతీయ జీవన విధానమే రామ తత్త్వం.ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం ఇలాంటి విషయాలు వాడుకుంటాయి.మనుషుల కంటే ప్రకృతి ఎంతో గొప్పదని మనం చేసే తప్పులను ప్రకృతి(Nature) సరిదిద్దుతుందని ఈయన వెల్లడించారు.మనం ఇలాగే చేస్తూ పోతే కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి అంటూ కూడా ఈయన వెల్లడించారు.

ప్రస్తుతం మనుషులలో క్రూరత్వం పెరిగిపోయిందని అది పెరగడానికి డబ్బే ప్రధాన కారణమని తెలిపారు.ఇలా మనుషులు చేసే తప్పులను దేవుడు బ్యాలెన్స్ చేస్తారని శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube