అప్పట్లో ఒక సినిమా కోసం దాదాపు ఒక నెల, రెండేళ్లు, మూడు నెలలు అలా సమయం తీసుకునే వారు దర్శకులు.కొన్నిసార్లు రోజుల లెక్క కాకుండా నెలకు ఇంత అని రెమ్యూనరేషన్ కూడా ఇచ్చి హీరోలను బ్లాక్ చేసుకునేవారు.
ఇప్పుడంటే రోజుకు లేదా నెలకు లేదా సినిమాకి అని అంటున్నారు కానీ అప్పట్లో నెలవారి జీతాలపై ఆర్టిస్టులు పని చేసేవారు వారికి అదే ఖచ్చితమైన జీతం గా ఉంటుంది కాబట్టి నమ్మకంగా పనిచేసేవారు.నెలకు ఇంత జీతం వస్తుంది కాబట్టి మరే సినిమాలో నటించాల్సిన అవసరం లేదు పైగా నెల తిరిగేసరికి జీతం వస్తుంది.
నటించిన నటించకపోయిన పర్వాలేదు అని వాళ్లకు ఎంతో కాన్ఫిడెంట్ ఉండేది.
అయితే ఎన్టీఆర్( Sr ntr ) కూడా నెలవారి జీతాలకు పని చేస్తున్న రోజుల్లో వేరే సంస్థల నుంచి ఏ దర్శకులు డేట్స్ అడిగితే వారికి ఇచ్చేవారు.ఆ సమయంలో ఎన్టీఆర్ ని ఒక సినిమాకి పని చేయమని విఠలాచార్య అడిగారట.అయితే ఆ నెలలో కేవలం వారం రోజులు మాత్రమే ఖాళీ ఉందట దాంతో వారం రోజులు ఇచ్చిన సరిపోతుంది అని విఠలాచార్య సమాధానం చెప్పారట.
వారం రోజుల్లో సినిమా ఎలా తీస్తారు అని అనుమానం ఎన్టీఆర్ కి వచ్చింది.అందుకని ఎన్టీఆర్ ఎన్ని సార్లు అడిగినా విఠలాచార్య వారం రోజులు సరిపోతుందని కరాకండిగా చెప్పడంతో ఎక్కడ రెండు మూడు పాటలకు డ్యాన్సులు చేయించుకుని, ఆ డ్యూయెట్స్ తర్వాత శవాసనం వేయిస్తాడేమో అని అనుమానం వచ్చిందట ఎన్టీఆర్ కి.
దాంతో ఎన్టీఆర్ విఠలాచార్య సినిమాకి డేట్స్ ఇవ్వడం కుదరదని చెప్పేసాడట.ఇక మరోసారి అడవి రాముడు ( Adavi Ramudu )సినిమా తర్వాత ఎన్టీఆర్ తన బ్యాక్ డ్రాప్ మార్చుకోవడం కోసం ఒక జానపద సినిమాను తీయాలి అనుకున్నారట.ఒకవైపు ఎన్టీఆర్ తన జానపదంతో వస్తుండగా మరోవైపు గిరిబాబు కృష్ణతో సైతం మరొక జానపదాన్ని ప్రకటించారు ఇక అదే సమయంలో కృష్ణకి, ఎన్టీఆర్ కి పోటీగా విఠలాచార్య నరసింహారాజు, జయమాలిని కాంబినేషన్లో జగన్మోహిని అనే సినిమా చేశారు.ఈ మూడు చిత్రాలు ఒకేసారి విడుదలవగా జగన్మోహిని( Jaganmohini ) చిత్రమే అన్నిటి కన్నా ఎక్కువగా డబ్బులు వర్షాన్ని కురిపించింది.