నటన అంటే కేవలం హీరోయిజం మాత్రమే కాదు.తనలోని నటుడు తనని జయించాలి.
అప్పుడే సరికొత్త నటుడు పుడతాడు.అప్పుడే కొత్త పాత్రలకి ప్రాణం వస్తుంది.
ఖచ్చితంగా అల్లరి నరేష్ కూడా తనను తాను జయించుకున్నాడు అని చెప్పాల్సిందే.
కెరియర్ ఆరంభంలో అల్లరి వంటి సినిమాతో ప్రారంభించడంతో ఇంటి పేరు అల్లరి నరేష్( Allari Naresh ) గా మారిపోయిన నేను వంటి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయడం అతనికి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.ఆ సినిమా ద్వారానే అతనిలోని నటుడు బయటకు వచ్చాడు.అల్లరి చిల్లరగా ఎన్నో కామెడీ పాత్రలు చేసిన అంత పెద్దగా అతడికి పేరు రాలేదు కానీ భారమైన లేదా ఎంతో డెప్త్ ఉన్న పాత్రలతోనే అల్లరి నరేష్ కి మంచి నటుడు అనే పేరు వచ్చింది.
అల్లరి నరేష్ గురించి చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఆయన నటించిన కొన్ని సినిమాలు.ముఖ్యంగా గమ్యం సినిమా( Gamyam )లో గాలి శీను పాత్ర.
నరేష్ లోని మరొక నటుడు ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ సినిమా ద్వారానే ఎంతో మంది అభిమానులను అతడు సంపాదించుకోగలిగాడు.
ఆ తర్వాత అతనికి ఉపయోగపడిన మరొక పాత్ర శంభో శివ శంభో చిత్రంలో మల్లి.అల్లరి నరేష్ కెరీర్ లో రెండవ అతిపెద్ద అలాగే మంచి పాత్ర కూడా ఇదే.ఇక మహర్షి సినిమాలో మహేష్ బాబుకి స్నేహితుడిగా రవి పాత్ర కూడా అల్లరి నరేష్ కెరీర్ లో చెప్పుకోదగిన పాత్రలో ఒకటిగా నిలిచిపోతుంది.
ఈ మూడు పాత్రల్లో అల్లరి నరేష్ నటన అమోఘం.సోలో హీరోగా ప్రస్తుతం హిట్టు కొట్టలేని పరిస్థితులలో అల్లరి నరేష్ కెరీర్ ఉండడంతో పెద్ద హీరోల సరసన చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ ను లాగుతున్నాడు.మొన్నటి సంక్రాంతికి నా సామి రంగ ( Naa Saami Ranga )చిత్రంలో అంజి అనే పాత్రలో వచ్చాడు.
పరవాలేదు సినిమా బాగానే ఉంది అల్లరి నరేష్ పాత్ర కూడా ఓకే.వెరిసి టాలీవుడ్ కి కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికాడు.అతడిని సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు చేయగలడు.ఎటోచ్చి మన తెలుగు దర్శకులకు ఇలాంటి మంచి నటులు కనిపించరు కదా బాలీవుడ్ నుంచి పట్టుకొస్తారు.