కృష్ణంరాజు రెండో భార్య శ్యామలాదేవి( Shyamala Devi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కృష్ణంరాజు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించడంతో పాటు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.ఆయన భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.

జనవరి 20వ తేదీన కృష్ణంరాజు( Krishnam Raju ) పుట్టినరోజు కాగా శ్యామలాదేవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నా సర్వస్వం కృష్ణంరాజు గారు అని ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదని ఆయన జ్ఞాపకార్థంగా మిగులున్నానని శ్యామలాదేవి కామెంట్లు చేశారు.మా చుట్టాల ద్వారా కృష్ణంరాజుతో పెళ్లి కుదిరి ఆయన అర్ధాంగిగా మారానని శ్యామలాదేవి వెల్లడించారు.కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి అని అన్నారు.</br

ఆమె కారు ప్రమాదంలో మరణించిందని కృష్ణంరాజు మొదట రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మామయ్య నిరాహార దీక్ష చేసి ఒప్పించారని ఆమె వెల్లడించారు.తండ్రి బాధ చూడలేక ఆయన రెండో పెళ్లికి అంగీకరించారని శ్యామలాదేవి పేర్కొన్నారు.మొదట రెండో పెళ్లి అని మా అమ్మ ఒప్పుకోలేదని ఆమె కామెంట్లు చేశారు.నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపానని శ్యామలాదేవి అన్నారు.

నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారేమో అని కృష్ణంరాజు భావించారని శ్యామలాదేవి పేర్కొన్నారు.కృష్ణంరాజు మొదటి భార్యకు వారసుడు పుట్టాడని డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించాడని శ్యామలాదేవి చెప్ప్పుకొచ్చారు.శ్యామలాదేవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్యామలాదేవికి వరుసకు కొడుకైన ప్రభాస్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ రాజాసాబ్( Rajasaab ) సినిమాపై, ప్రాజెక్ట్ కే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ప్రభాస్ కు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.







