కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ నిరాహార దీక్ష చేయనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు విశాఖలోని సెంట్రల్ జైలులో రేపు శ్రీనివాస్ దీక్ష చేయనున్నారు.
కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని లేదా సీఎం జగన్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నాడు.లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తానని చెబుతున్నట్లు సమాచారం.
మరోవైపు శ్రీనివాస్ కు మద్ధతుగా విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆమరణ దీక్షకు దిగుతామని తెలిపారు.







