తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది, కానీ కొన్నిసార్లు ఈ బంధంలో కలతలు ఏర్పడతాయి.తల్లిదండ్రులు తమ పిల్లలకు( Children ) ఉత్తమమైన లైఫ్ ఇవ్వాలని భావించి సన్మార్గంలో నడిపిస్తారు.
కానీ కొన్నిసార్లు వారు పిల్లల నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు.వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తారు.
ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి సమస్యలను కలిగిస్తుంది.ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో తాజాగా చైనాలో ( China ) జరిగిన ఓ ఉదంతం తెలియజేస్తోంది.
ఎక్స్‌ట్రా క్లాస్‌లకు అటెండ్ కావాలని బలవంతం చేసినందుకు ఓ బాలుడు తన తల్లిదండ్రులపై( Parents ) కేసు పెట్టాడు.బాలుడు చైనాలోని హుబే ప్రావిన్స్‌లో( Hubei Province ) నివసిస్తున్నాడు.తల్లిదండ్రులు, ట్యూటర్ పెట్టిన ఒత్తిడితో అతను చాలా అసంతృప్తి చెందాడు, చివరికి పోలీసు స్టేషన్‌కు( Police Station ) వెళ్లాడు.ఇప్పుడీ బాలుడి స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలుడు జియాంగ్‌యాంగ్‌లోని పోలీసు స్టేషన్‌కు స్కూల్ యూనిఫాంలోనే వెళ్లాడు.పాఠశాల ముగిసిన తర్వాత, వారాంతాల్లో తల్లిదండ్రులు తనను ట్యూషన్ క్లాసులు( Tution Classes ) తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపాడు.
ఇది తనపై చాలా ఎక్కువ ఒత్తిడి కలిగిస్తుందని, క్లాసుల వల్ల దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నానని చెప్పాడు.
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారని కూడా చెప్పాడు.పోలీస్ స్టేషన్‌లో బాలుడు రోదించడంతో అధికారులు అతనికి టిష్యూలు ఇచ్చారు.తాను చదువులో నిష్ణాతుడని, మంచి మార్కులు తెచ్చుకున్నానని, అయినా తల్లిదండ్రులు సంతృప్తి చెందలేదన్నాడు.
బాలుడికి సహాయం చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.తల్లిదండ్రులతో మాట్లాడతామని, అయితే ముందుగా మ్యాథ్స్ హోంవర్క్ చేయాల్సి ఉందన్నారు.
ఆ అబ్బాయి కథ విని చాలా మంది జాలి పడ్డారు.చైనాలో విద్యావ్యవస్థ చాలా కష్టతరమైనది.
విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.