ఎన్టీఆర్( NTR )… నందమూరి నట వారసుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఎన్టీఆర్ అంచెలంచలుగా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతున్నాడు.ఇక ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే సినిమాల విషయంలో కూడా అలాగే ఉంటుంది.
ఆయన ఒక్కసారి కథ నచ్చితే ఖచ్చితంగా అది హిట్ అవుతుందనే భావన అందరిలో ఉంటుంది.అలాగే ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందట.
దాదాపు తారక్ రిజెక్ట్ చేసిన అన్ని సినిమాలు పరాజయాలు అవుతున్నాయి అనే ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది.
ఆయన ఇటీవల రీసెట్ చేసిన ఒక రెండు సినిమాలు మంచి ఎగ్జాంపుల్స్ అని కూడా తారక అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.మొన్నటికి మొన్న వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Naa Peru Surya Naa Illu India ).ఈ సినిమా కథ మొదట వక్కంతం వంశీ వినిపించాడట.
కానీ కథలో అనేక మార్పులు సూచించాడట తారక్.కానీ ఆలోపే అల్లు అర్జున్ ఆ కథకు ఓకే చేయడంతో ఆ సినిమా చివరికి ఎలా పరాజయం పాలయింది అనే విషయం మనందరికీ తెలిసిందే.ఇక నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రం కూడా మొదట తారక్ దగ్గరికి వెళ్ళగా ఒక పెద్ద హీరో ఇలాంటి ఒక సినిమాను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు అంటూ తారక్ సున్నితంగా ఆ కథని రిజెక్ట్ చేశాడట.ఇక సదరు చిత్రం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా వంతు కూడా వచ్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పగా ఏ కారణం చేతనో ఆయన ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట.అటు తిరిగి ఇటు తిరిగి ఈ చిత్రం మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది.చివరగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూట గట్టుకోవాల్సి వచ్చింది.దీంతో తారక్ ఏ సినిమా రిజెక్ట్ చేసిన అది పరాజయం పాలు అవుతుంది అని ఆయన అభిమానులు కరాకండిగా చెబుతున్నారు.