సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాతో అలరించబోతున్నారని తెలిస్తే అభిమానుల్లో ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోతాయి.వారు బడా స్టార్ హీరోలు అయితే హైప్ అనేది కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోతుంది.
అంత హైట్ క్రియేట్ చేసి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా మంచిగా లేకపోతే అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.ఇప్పటిదాకా ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.
వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి.అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఎక్స్‌పెక్టషన్స్‌తో వచ్చి డిజాస్టర్ అయిన సినిమాల ఏవో తెలుసుకుందాం పదండి.
ఆచార్య

రామ్ చరణ్, చిరంజీవి కాంబోలో తెరకెక్కిన “ఆచార్య( Aacharya )” సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది.తీరా చూస్తే చెత్త కథతో బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అందుకుంది.ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకున్న ఈ మూవీ చివరికి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.
శంకర్ దాదా జిందాబాద్
చిరంజీవి, శ్రీకాంత్ కాంబోలో శంకర్ దాదా జిందాబాద్( Shankar Dada Zindabad ) సినిమా కూడా ఫెయిల్ అయింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ అతిధి పాత్ర కూడా చేశాడు.శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ సూపర్‌గా ఉంటుంది.దానికి ఒక సీక్వెల్‌లాగా వచ్చిన ఈ మూవీ కూడా అద్భుతంగా ఉంటుందని అనుకున్నారు కానీ అది తుస్సుమనిపించింది.
సుల్తాన్

కృష్ణ, కృష్ణంరాజు నందమూరి బాలకృష్ణ తారాగణంలో వచ్చిన సుల్తాన్ మూవీ( Sultan ) కూడా బీభత్సమైన హైప్ క్రియేట్ చేసింది కానీ ఇది కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది.
అశ్వమేధం
రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, నందమూరి బాలకృష్ణ కలిసి చేసిన మూవీ అశ్వమేధం( Aswamedham ) చాలా పూర్ రెస్పాన్స్ అందుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ చాలా డబ్బులు పెట్టి మూవీ తీసినా అది ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
రామకృష్ణులు

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌లో జగపతి వి.రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన రామకృష్ణులు సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది.ఈ సినిమా అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాల “హేరా పేరి” హిందీ సినిమా నుంచి స్ఫూర్తిని పొందింది.కృష్ణ, కృష్ణంరాజు చేసిన మల్టీస్టారర్ “యుద్ధం”, కృష్ణ, శోభన్ బాబు నటించిన “కృష్ణార్జునులు”, కృష్ణ శోభన్ బాబు కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ “మహాసంగ్రామం” కూడా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి.







