మనుషులే కాదు జంతువులు కూడా అదును చూసుకుని తమకు కావాల్సినవి చేజిక్కించుకుంటాయి.ఇప్పటికే కొన్ని తెలివైన జంతువులు ఒకరి బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఒక ఏనుగుల మంద( Elephants Herd ) అడవిలో ఆగిపోయిన ట్రక్కును తమ ఆహారం కోసం ఉపయోగించుకున్నాయి.అడవిలో ఈ జంతువులకు ఎక్కువగా పండ్లు దొరకవు.
అలాంటి వాటికి ట్రక్కు( Truck ) నిండా బత్తాయి పండ్లు కనిపించడంతో వాటి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఆగిపోయిన ట్రక్కు దగ్గరికి వచ్చి అవి హాయిగా బత్తాయి పండ్లు( Oranges ) తినేసాయి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ట్రక్కు టైరు పంచర్ కావడం మనం చూడవచ్చు.దానిని ట్రక్కు డ్రైవర్‌తో పాటు ఓ అసిస్టెంట్ మార్చడానికి ఆపసోపాలు పడుతున్నారు.అయితే వీరు ఇలా కష్టపడుతుంటే ట్రక్కు ఆగిపోవడమే తమకు అదృష్టంగా భావించిన ఏనుగులు( Elephants ) అందులోని ఆరెంజ్‌లు తినడం మొదలుపెట్టాయి.
వైరల్ వీడియోలో( Viral Video ) ట్రక్కు నిండా ఆరెంజ్‌లు ఉండటం మనం చూడవచ్చు.వాటి చుట్టూ ఒక ఏనుగుల మంద చేరింది.అవి ఒక్కో బత్తాయి పండు ని తీసుకొని తినడం స్టార్ట్ చేశాయి.అన్ని బత్తాయి పండ్లను అవి ఒకేసారి చూసినా వాటిపై ఎగబడలేదు.
చాలా మర్యాదపూర్వకంగా ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఆశ్చర్యపరిచాయి.

ఈ వీడియోను @Buitengebieden ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోకు 1 కోటి 41 లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో( South Africa ) జరిగినట్లు ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
కొత్త టైరు అమర్చే లోగా ఈ ఏనుగులు మొత్తం బత్తాయిలను తినేసాయేమో అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.ఇవి ఇలా తినేస్తే డబ్బులు ఎవరు కట్టాలి అని మరికొందరు పేర్కొన్నారు.
అయితే పండ్లను తినే హక్కు జంతువులకు ఉంటుందని ఒకరు రిప్లై ఇచ్చారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







