చిరుధాన్యాల పంటలను ఆశించే డౌనీ బూజు తెగుళ్ల నివారణ కోసం చర్యలు..!

చిరుధాన్యాల పంటలను ఆశించే డౌనీ బూజు( Downy Mildew ) తెగులు ఒక ఫంగస్ వల్ల పంటలను ఆశిస్తాయి.ఈ తెగుళ్లు తన అతిధి మొక్కలతో చాలా సులభంగా కలిసి పోవడం వల్ల పంటకు కొత్త రకం ఫంగస్( Fungus ) కూడా సోకే అవకాశం ఉంది.

 How To Prevent Downy Mildew In Millet Crop Details, Downy Mildew ,millet Crop,-TeluguStop.com

ఈ ఫంగస్ మట్టిలో ఉండే మొక్కల అవశేషాలలో జీవించి ఉంటుంది.కుల పరిస్థితులు ఏర్పడినప్పుడు గాలి లేదా వర్షపు తుంపర్ల వల్ల ఈ ఫంగస్ వ్యాప్తి చెందుతుంది.

వృద్ధి చెందుతున్న చిరుధాన్యాల( Millets ) మొక్కల లేత ఆకులపై ముందుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు క్రమంగా పెద్దవై ఈనెలతో వేరు చేయబడితే ఆ మొక్కలకు ఈ తెగుళ్లు సోకినట్టే.దీంతో లేత చిగుర్లు రాలిపోవడం మొక్కల ఎదుగుదల పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది.

ఈ తెగుళ్ల వల్ల దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.

మార్కెట్లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.పొలంలో గాలి సరిగా ప్రసారం అయ్యేటట్టు, మొక్కలను పొడిగా ఉంచాలి.పంట పొలాలకు నీటిని రాత్రి సమయంలో కాకుండా పగటిపూట మాత్రమే అందించాలి.

మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు చూసుకోవాలి.పొలంలోనే కాదు పొలం గట్లపై కూడా కలుపు మొక్కలు( Weeds ) లేకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే.సేంద్రియ ప్రీ ఇన్ఫెక్షన్ శిలీంద్ర నాశినులను ఉపయోగించి ఈ తెగులు వ్యాపించకుండా అరికట్టవచ్చు.బోర్డే యక్స్ మిశ్రమం లాంటి రాగి కలిగిన ఫంగస్ నిరోధకాలను ఉపయోగించాలి.రసాయన పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే.ఫాసెటిల్- అల్యూమినియం, ఫెనలమైడ్స్ లాంటి శిలీంద్ర నాశినులను ఉపయోగించి అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube