టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు.
టాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు త్రివిక్రమ్.ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్ లు త్రివిక్రమ్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
ఆ సంగతి అటు ఉంచితే గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) విడుదల తర్వాత ప్రతి ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటున్నారు.మరి ముఖ్యంగా ఆయన సినిమాలలో సెకండ్ హీరోయిన్ ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
త్రివిక్రమ్ సినిమాలలో నటించే సెకండ్ హీరోయిన్ లు( Second Heroines ) ఏదో సినిమాలో ఉండాలి అంటే ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారు.ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసినా కూడా పెద్దగా వారికి గుర్తింపు దక్కడం లేదు.అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ఈషా రెబ్బ( Eesha Rebba ) ఆ చిత్రంలో ఎన్టీఆర్ తో ఒకటి రెండు సీన్స్ కి పరిమితమైంది.అలాగే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములో అల్లు అర్జున్ కి సెకండ్ హీరోయిన్ గా వచ్చిన నివేద పేతురేజ్( Niveda Pethuraj ) కూడా ఒకటి రెండుసార్లు కనిపించి మాయమైంది.
ఇప్పుడు గుంటురు కారంలో మీనాక్షి చౌదరి( Meenakshi Choudary ) కూడా మహేష్ కి మందులోకి ఆమ్లెట్ వెయ్యడానికి ఉన్నట్టుగా ఒకటి రెండు సన్నివేశాలకి పరిమితం చేసారు.త్రివిక్రమ్, మహేష్ అడగ్గానే ఒప్పేసుకున్న మీనాక్షి చౌదరి త్రివిక్రమ్ ని నమ్మిందా, మహేష్ సినిమా అని చిన్న రోల్ అయినా ఒప్పుకుందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మహేష్ బాబుకి( Mahesh Babu ) అన్నం ప్లేటు తెచ్చివ్వడం, మహేష్ ఇంటికి రాగానే అమ్మకు చెప్పడం, మహేష్ డ్రింక్ చేస్తుంటే ఆమ్లెట్ ప్లేట్ అందివ్వడం, మావయ్య జయరాంతో బావ బయట అందరిని కొడుతున్నాడని కంప్లయింట్ చేయడం ఇది మీనాక్షి క్యారెక్టర్ కి త్రివిక్రమ్ ఇచ్చిన ప్రాధాన్యత.దీంతో కొందరు త్రివిక్రమ్ పై మండి పడుతూ హీరోయిన్స్ మీరు ఇకపై త్రివిక్రమ్ ని నమ్మడం మానెయ్యండి అంటూ పూనమ్ లాంటి హీరోయిన్స్ గురూజీని టార్గెట్ చేస్తున్నారు.అలాంటి పాత్రలు చెయ్యకపోయినా పోయేదేమీ ఉండదు, త్రివిక్రమ్ అని సినిమా ఒప్పుకుంటే ఇలాంటి మాటలే వినాల్సి వస్తుంది అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.